హోమ్ హీరో జెన్యూన్ పార్ట్స్
మెనూ

హీరో జెన్యూన్ పార్ట్స్

కస్టమర్లకు ఒక ఉల్లాసభరితమైన ప్రయాణాన్ని అందించడమే హీరో మోటోకార్ప్ వ్యాపార ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం, మరియు 100% కస్టమర్ శాటిస్ఫాక్షన్ అందించడానికి, మా కస్టమర్లకి జెన్యూన్ పార్ట్స్ విక్రయించడానికి హీరో మోటోకార్ప్ లిమిటెడ్‌కి ఒక డెడికేటెడ్ బిజినెస్ యూనిట్ ఉంది అది

HGP అంటే హీరో జెన్యూన్ పార్ట్స్ అని ప్రసిద్ధి. ఇప్పుడు మీరు కొత్తగా ప్రారంభించబడిన మా eshop.heromotocorp.com పోర్టల్ నుండి నేరుగా హీరో జెన్యూన్ పార్ట్స్ కొనుగోలు చేయవచ్చు.

విజన్ : "కస్టమర్‌ తనకు అవసరమైన ఒక పార్ట్ కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు"

కస్టమర్‌కి ఎప్పటికీ నిలిచిపోయే ఆనందకరమైన అనుభూతిని అందించడానికి హీరో మోటోకార్ప్ వీటి పైన దృష్టి పెట్టింది- అందరికీ అందుబాటులో ఉండేలా విస్తరించడం, ఇండస్ట్రి బెంచ్‌మార్క్స్ సెట్ చేయడం మరియు ఓనర్‌షిప్ ఖర్చును తగ్గించడం.

మా వనరులను పెంచుతున్నాం

హీరో మోటోకార్ప్‌లో మేము ప్రభావశీలమైన వాతావరణం ఉండేలా చూస్తాము తద్వారా మల్టీ లేయర్ ఉన్న భారతీయ మార్కెట్లో వీలైనంత లోతుగా, విస్తారంగా కనిపిస్తాము. ఎప్పటికప్పుడు మారుతూ ఉండే కస్టమర్ల కోరికలకు తగ్గట్టు నిరంతరం మేము కస్టమర్ల మనసు గెలుచుకునే ప్రతి సందర్భం అది మా రెస్పాన్స్ నుండి వారి ఆశలు నెరవేరే విధంగా ప్రయత్నిస్తాము. HGP ప్రపంచవ్యాపితంగా 35 దేశాల్లో 6000+ టచ్ పాయింట్స్ ద్వారా మరియు దేశవ్యాప్తంగా 95 పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్లు, 800 ఆథరైజ్డ్ డీలర్లు మరియు 1300 ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లతో విస్తరించి ఉంది. మీ దగ్గరలో ఉన్న టచ్ పాయింట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మీరు హీరో మోటోకార్ప్ కుటుంబంలో భాగమై కస్టమర్లకు సేవను అందించే విషయంలో మాతో కలిసి పనిచేయాలి అనిపిస్తే ఇక్కడ అప్లై చేయండి.

పరిశ్రమ బెంచ్‌మార్కులను సెట్ చేయడం

హీరో జెన్యూన్ పార్ట్స్ మాత్రమే మీ హీరో టూ-వీలర్ల కోసం సర్టిఫై చేయబడ్డ పార్ట్స్. మీకు మెరుగైన మరియు సాటిలేని పనితీరు అందించడానికి మీ బైక్ కోసం సరిగ్గా సరిపోయే విధంగా అవి ఖచ్చితత్వంతో తయారు చేయబడ్డాయి. హీరో జెన్యూన్ పార్ట్ అని నిర్ధారించడానికి ముందు ప్రతి పార్ట్ కఠినమైన నాణ్యత పరీక్షకు గురి అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్స్ నీమ్రాణలోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్ (GPC) ద్వారా కూడా సప్లై చేయబడుతున్నాయి.

GPC భవిష్యత్తు ఆలోచనల ప్రాతిపదికన పని చేస్తుంది. కటింగ్ ఎడ్జ్ సిస్టమ్స్ కలిగిన అత్యాధునిక తయారీ ఫెసిలిటీతో సప్లై చైన్ ప్రాసెస్లను అందించడమే కాకుండా ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన మరియు అందమైన పని వాతావరణాన్ని అందిస్తుంది. హీరో గార్డెన్ ఫ్యాక్టరీతో పాటు 35 ఎకరాలలో విస్తరించి ఉన్న GPC, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న హీరో నీమ్రాణా కాంప్లెక్స్‌లో ముఖ్యమైన భాగం. లీన్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్స్ ఆధారంగా డిజైన్ చేయబడిన GPCలో అతి తక్కువ మానవ ప్రమేయం ఉంటుంది కానీ మెరుగైన ఉత్పాదకత ఉంటుంది. ఆటో సెక్టార్‌లో ఈ సాంకేతిక అద్భుతం ఒక నూతన పరిశ్రమ బెంచ్‌మార్కును ఏర్పరిచింది. ఇందులో ఆటోమేటెడ్ స్టోరేజ్ మరియు రిట్రీవల్ సిస్టం (ASRS) మరియు ఆటోమేటెడ్ ప్యాకేజింగ్ మరియు సార్టింగ్ సిస్టం ఉన్నాయి. ఇవే కాకుండా, కస్టమైజ్ చేయబడిన మరియు ప్రత్యేకమైన వేర్‌హౌజ్ మ్యానేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా పార్ట్స్‌ను ఆన్-లైన్ ట్రాకింగ్ ద్వారా నియంత్రించే యుని-షటుల్ మరియు రైల్ గైడెడ్ మెటీరియల్ మూవ్‌మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అనుసరించి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) గార్డెన్ ఫ్యాక్టరీని ప్లాటినం క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీగా గుర్తించింది.

అతి తక్కువ ఓనర్‌షిప్ ఖర్చు

హీరో మోటోకార్ప్ తన ప్రోడక్ట్స్, పార్ట్స్ మరియు సర్వీసులతో కస్టమర్ అనుభూతిని మెరుగుపరచడమే కాకుండా ఒక 2 వీలర్ యొక్క ఓనర్‌షిప్ ఖర్చును కూడా తగ్గించడానికి కట్టుబడి ఉంది. ఈ ప్రయత్నంలో కొనుగోలు చేయడానికి, ఇన్‌స్టాల్ చేయడానికి, ఉపయోగించడానికి, నిర్వహించడానికి మరియు ఒక ప్రోడక్ట్ రీప్లేస్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ, మా కస్టమర్ల కోసం పార్ట్స్ రీప్లేస్‌మెంట్ ఖర్చును తగ్గించడానికి పూర్తి HGP పోర్ట్‌ఫోలియోని అందుబాటు ధరలో ఉంచబడింది.

  • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
  • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018

వాట్సాప్‌లో కనెక్ట్ అవడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి