మెనూ

తరచుగా అడగబడే ప్రశ్నలు

స్పార్క్ ప్లగ్ చెడిపోతే ఏమి చెయ్యాలి?

 ఇగ్నీషన్ సిస్టమ్‌‌‌‌‌లోని ముఖ్యమైన భాగాలలో స్పార్క్ ప్లగ్ ఒకటి. అధిక వోల్టేజీని మళ్ళీ మళ్ళీ డిశ్చార్జ్ చేయడం వలన మరియు జ్వలన చర్య వలన జరిగే కరోజివ్ ఆక్సిడేషన్ వలన స్పార్క్ ప్లగ్ యొక్క ఎలెక్ట్రోడ్స్‌‌‌‌‌‌లలో అరుగుదల ఏర్పడుతుంది, దీని వలన క్రమేపీ ప్లగ్ గ్యాప్ పెరుగుతుంది.
సమయం గడిచే కొద్దీ స్పార్క్ ప్లగ్‌‌‌‌‌‌‌‌లో క్షీణత ఏర్పడుతుంది కనుక, ప్రతి 12000 కిమీలకి ఒకసారి స్పార్క్ ప్లగ్‌‌‌‌‌‌‌‌ను మార్చమని సాధారణంగా సిఫారసు చేయబడుతుంది. అటువంటి స్పార్క్ ప్లగ్‌‌‌‌‌‌‌‌ను ఎక్కువ కాలం ఉపయోగించినట్లయితే స్టార్టింగ్ సమస్యలు, మిస్‌‌‌‌‌‌‌‌ఫైరింగ్, పవర్ తగ్గడం లేదా ఇంధనం అధికంగా ఖర్చవడం లేదా ఉద్గారాలు అధికంగా వెలువడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన పరిస్థితులలో మీ వాహనం మార్గమధ్యంలో నిలిచిపోయి స్పార్క్ ప్లగ్ రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ ఒక్కటే గత్యంతరం అవ్వచ్చు.
దీర్ఘకాలం పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి HGP స్పార్క్ ప్లగ్స్ మీ హీరో వాహనం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. మరింత సహాయం కోసం, దయచేసి మీ సమీప ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

నేను ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పుడు మార్చాలి?

 ఎయిర్ ఫిల్టర్ అనేది ఇంజిన్ భాగాలను రక్షించడానికి ఇన్‌టేక్ ఎయిర్‌లోని రేణువులు మరియు ధూళి కణాలను ఫిల్టర్ చేస్తుంది. సాధారణంగా దీర్ఘకాలం ఉపయోగించినట్లయితే, అందులో రేణువులు మరియు ధూళి కణాలు పోగుపడి అవరోధం కలిగిస్తాయి.
హీరో మోటోకార్ప్ వాహనాలు ప్రాథమికంగా మూడు రకాల ఎయిర్ ఫిల్టర్‌లు కలిగి ఉంటాయి, అవి పాలియూరేథీన్ వెట్ టైపు, డ్రై పేపర్ మరియు విస్కస్ పేపర్ టైపు. పాలియూరేథీన్ మరియు డ్రై పేపర్ ఫిల్టర్లకు పీరియాడిక్ క్లీనింగ్ అవసరం. పాడైపోతే కనుక పాలియూరేథీన్‌ను మార్చాలి మరియు డ్రై పేపర్ ఫిల్టర్‌ను ప్రతి 12000 కిమీలకు ఒకసారి మార్చాలి. విస్కస్ పేపర్‌ని శుభ్రపరచనవసరం లేదు మరియు ప్రతి 15000 కిమీలకు ఒకసారి మార్చవలసి ఉంటుంది. దుమ్మూ ధూళి ఎక్కువ ఉండే ప్రాంతాలలో తరచుగా శుభ్రపరచడం లేదా ముందుగానే రీ‌ప్లేస్‌మెంట్ చేయడం అవసరం అవ్వచ్చు.
సిఫారసు చేయబడిన షెడ్యూల్‌ను అనుసరించకపోతే, అది ఇంజిన్ పవర్‌లో క్షీణతకు దారి తీయవచ్చు, ఇంధన సామర్థ్యం తగ్గిపోవచ్చు మరియు ఇంజిన్ ఫెయిల్యూర్‌ జరిగి మరమ్మతుల కోసం అధిక వ్యయం అవ్వచ్చు.
జెన్యూన్ ఎయిర్ ఫిల్టర్‌ని వాడకపోవడం వల్ల ఫిల్టరింగ్ సామర్థ్యం ప్రభావితం కావచ్చు. HGP ఫిల్టర్లుగా కనపడే నాసిరకం ఫిల్టర్లు బహిరంగ మార్కెట్లో అనేకం లభ్యమవుతున్నాయి. అటువంటి ఫిల్టర్లు సాధారణ ఉపయోగం మీద పాడైపోయి ఫిల్టర్లను క్షీణించేలా చేసి సీలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఉత్తమ ఇంజిన్ పనితీరు మరియు దీర్ఘకాల మన్నిక కోసం HGP ఎయిర్ ఫిల్టర్‌ను మాత్రమే ఉపయోగించండి. మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న వర్క్‌షాప్‌ను సందర్శించండి.

ఇంధన ట్యూబ్‌ని నేను ఎప్పుడు మార్చాలి?

 ఇంధన ట్యూబ్ అనేది ఇంధన ట్యాంక్ నుండి కార్బురేటర్ వరకు నిరంతర ఇంధనం ప్రవాహం జరిగే ఒక సంధానం.
సగటున 4 సంవత్సరాలకి ఒక సారి ఇంధన ట్యూబ్‌ని మార్చమని సిఫారసు చేయబడుతుంది. అసాధారణ పరిస్థితులలో 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు వాహనం ఉపయోగించకపోతే, ఇంధన హోస్‌ని మార్చవలసి ఉంటుంది.
ఇంధనం యొక్క నిరంతర ప్రవాహం వలన మరియు పెట్రోల్ యొక్క ఆవిరి అయ్యే గుణం వలన అంతర్గతంగా ఇంధన ట్యూబ్ యొక్క నాణ్యత క్షీణిస్తుంది మరియు పెట్రోల్ ఇంధన ట్యూబు జాయింట్ల నుండి లీక్ అవ్వడం ప్రారంభం అవుతుంది, ఇంధనం యొక్క వాసన ద్వారా దీనిని పసిగట్టవచ్చు.
HGP యొక్క ఇంధన హోస్ వివిధ లేయర్ల పదార్థాలతో తయారు చేయబడింది, ఇది అంతర్గతంగా ఇంధనం వలన కలిగే క్షీణతను తగ్గిస్తుంది మరియు వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. ఇంధన ట్యూబ్‌కి రెండు చివరల ఒక వైర్ క్లిప్‌తో కనెక్ట్ చేయబడి ఉండాలని సిఫారసు చేయబడుతుంది.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

ఒకవేళ ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే ఏమి జరుగుతుంది?

 ఇంజిన్ ‌ఆయిల్‌ని మార్చకుండా ఉపయోగిస్తే, దాని 'లూబ్రికేట్' మరియు 'శుద్ది చేసే' సామర్ధ్యం తగ్గిపోయి, సాధారణ ఇంజిన్ పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతుంది.
సాధారణంగా, ప్రతి 3000 కిమీలకు టాప్ అప్ చేసి ప్రతి 6000 కిమీలకు ఇంజిన్ ఆయిల్‌ను మార్చాలి.
పైన పేర్కొన్న షెడ్యూల్‌ను అనుసరించకపోతే, వాహన సామర్ధ్యం, మైలేజి తగ్గిపోయి ఇంజిన్ అతిగా వేడెక్కడం, శబ్దం రావడం వంటివి జరుగుతాయి. తీవ్రమైన పరిస్థితుల్లో పూర్తిగా ఇంజిన్ పూర్తిగా పాడయి బాగుచేసుకోడానికి ఎంతో సమయం మరియు ఖర్చు పెట్టవలసి ఉంటుంది.
HGP సిఫార్సు చేసిన 10W30 SJ JASO MA ఇంజిన్ ఆయిల్ యొక్క అత్యున్నత లక్షణాలు:-
• సమర్ధవంతమైన లూబ్రికేటింగ్, క్లీనింగ్, కూలింగ్ మరియు సీలింగ్ సామర్ధ్యాలు.
• మెరుగైన కోల్డ్ స్టార్ట్ సామర్థ్యం
• మెరుగైన డ్రెయిన్ వ్యవధి
• పర్యావరణ హితం
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

HGP రికమండ్ చేసిన ఇంజిన్ ఆయిల్ మాత్రమే కావాలని నేను ఎందుకు అడగాలి?

 బహిరంగ మార్కెట్లో 10W30 యొక్క రకరకాల గ్రేడులు అందుబాటులో ఉన్నాయి. 10W30 SJ JASO MA గ్రేడు ఇంజిన్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే:-
• సమర్ధవంతమైన లూబ్రికేటింగ్, క్లీనింగ్, కూలింగ్ మరియు సీలింగ్ సామర్ధ్యాలు.
• మెరుగైన కోల్డ్ స్టార్ట్ సామర్థ్యం
• మెరుగైన డ్రెయిన్ వ్యవధి
• పర్యావరణ హితం
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

సూచించిన సమయానికి విధిగా డ్రైవ్ చెయిన్ సర్వీస్ చేయించుకోకపోతే ఏమవుతుంది?

 డ్రైవ్ చెయిన్ జీవితకాలం దాని సరైన లూబ్రికేషన్ మరియు అడ్జస్టుమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే అది త్వరగా అరిగిపోతుంది. అరిగిపోయి దెబ్బతిన్న స్ప్రాకెట్లు డ్రైవ్ చెయిన్ తెగిపోయేలా చేయడం ద్వారా వాహనం యొక్క పనితీరు పై ప్రభావం చూపిస్తుంది. బండి నడిపేటప్పుడు కఠినమైన శబ్దాలు రావడం మరియు చెయిన్ శబ్దం చేయడం వంటివి చెయిన్ స్ప్రాకెట్ కిట్ మార్చుకోవాలి అని తెలియజేసే సూచికలు.
డ్రైవ్ చైన్ కనుక తీవ్రంగా దెబ్బతింటే వాహనం నడిపేటప్పుడు ఊగిసలాటకు కారణం అవ్వచ్చు, స్ప్రాకెట్ నుండి స్థానభ్రంశం చెంది రైడర్ యొక్క భద్రతకు హాని కలగవచ్చు. దీని ఇంధన సామర్థ్యం తగ్గి డ్రైవబిలిటీ మీద ప్రభావం కూడా పడవచ్చు.
HGP యొక్క చెయిన్ స్ప్రాకెట్ కిట్లు అత్యున్నత నాణ్యత కలిగి ఉంటాయి మరియు ఎక్కువకాలం మన్నడానికి బాగా పరీక్షించబడ్డాయి.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

నేను నా స్కూటర్ యొక్క డ్రైవ్ బెల్ట్ ఎప్పుడు మార్చుకోవాలి?

 ఒక డ్రైవ్ బెల్ట్ ఎప్పుడూ పుల్లీతో కాంటాక్ట్ కలిగి ఉంటుంది అందువలన సమయం గడిచే కొద్దీ ఏర్పడే తీవ్రమైన అరుగుదల వలన దానిని రీప్లేస్ చేయవలసి ఉంటుంది. ఇంకా, ఇది రబ్బర్‌తో తయారు చేయబడి ఉండడం వలన రాపిడి వలన ఏర్పడే వేడి మరియు ఓజోన్ కారణంగా ఇది గట్టిపడి క్షీణిస్తుంది.
సూచించబడిన ప్రకారం డ్రైవ్ బెల్ట్ ప్రతి 24000 కిమీలకు ఒకసారి మార్చవలసి ఉంటుంది.
డ్రైవ్ బెల్ట్ అరిగిపోయినా లేదా గట్టిపడినా స్లీప్పేజ్, పవర్ తగ్గడం మరియు ఇంధన వినియోగం పెరగడం వంటివి సంభవించచ్చు.
HGP యొక్క డ్రైవ్ బెల్ట్ అనేది కాగడ్ బెల్టు, ఇది ప్రధానంగా సింథెటిక్ రబ్బరు, ఫైబర్లతో తీవ్రమైన రాపిడి, వేడి మరియు ఓజోన్‌ను తట్టుకునే విధంగా తయారు చేయబడింది తద్వారా ఎక్కువ జీవితకాలంతో పాటు సున్నితమైన రైడ్‌ను అందిస్తుంది.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి

అసాధారణమైన కీచుమనే శబ్దాలు, బ్రేకు సరిగా పడకపోవడం వంటి సమస్య వచ్చినప్పుడు ఏమి చేయాలి?

బ్రేకు షూస్/ ప్యాడ్లు వాటి సర్వీసు పరిమితి దాటి ఉపయోగిస్తే ఫ్రిక్షన్ తగ్గిపోవడం కారణంగా బ్రేకులు సరిగా పనిచేయవు. విపరీతమైన అరుగుదల వల్ల బ్రేకు ప్యాడ్లు/షూస్ యొక్క మెటల్ భాగం డ్రమ్/డిస్కుకు రాసుకొని డ్యామేజీ తీవ్రత పెరగడం, తద్వారా రిపేర్ ఖర్చు పెరగడమే కాకుండా వాహనదారునికి ప్రమాదకరంగా కూడా మారవచ్చు.
బ్రేకులు సరిగా పడకపోవడం, అసాధారణ శబ్దాలు మొదలైనవి బ్రేక్ షూ, ప్యాడ్, డ్రమ్ లేదా డిస్క్ మార్చడానికి సూచిక.
HGP బ్రేకు షూస్/ ప్యాడ్లు / డ్రమ్ / డిస్క్ అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వాహనదారుని భద్రతను దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినవి. స్వచ్ఛమైన మరియు సురక్షితమైన వాతావరణం కోసం షూస్/ ప్యాడ్లపైన నాన్-ఆస్బెస్టాస్ ఫ్రిక్షన్ మెటీరియల్ ఉపయోగించడం వంటి ఫీచర్స్ వలన మీ హీరో 2 వీలర్‌కి ఇది ఒక ఉత్తమ పరిష్కారం.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

క్షీణించిన తర్వాత కూడా నేను క్యామ్ చెయిన్ మార్చకపోతే ఏమవుతుంది?

విపరీతంగా అరిగిపోయిన చెయిన్ స్ప్రాకెట్‌తో సరిగా మెష్ అవకపోవచ్చు, అందువలన ఈ పరిస్థితులు క్యామ్ చెయిన్ నుండి శబ్దం రావడం, పెరఫార్మన్స్ తగ్గిపోవడం వంటి వాటికి దారితీస్తాయి. కొన్ని విపరీతమైన సందర్భాల్లో చెయిన్ తెగిపోవడం, తద్వారా ఇంజిన్ తీవ్రంగా నష్టపోయి రైడర్ భద్రతకు ప్రమాదకరంగా మారుతుంది.
HGP క్యామ్ చెయిన్ కిట్ ఇంజిన్ పని చేస్తున్నప్పుడు, అతి తీవ్రమైన ఒత్తిడిని కూడా తట్టుకునే విధంగా డిజైన్ చేయబడింది. ఇది ఇంజిన్ సామర్ధ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మరింత సహాయం కోసం, దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఆదరైజెడ్ వర్క్ షాప్ వద్ద సంప్రదించండి.

నా మోటార్ సైకిల్ పికప్ తగ్గింది. నేను క్లచ్ ఫ్రిక్షన్ డిస్క్ మార్చాలా?

ఫ్రిక్షన్ డిస్క్‌లు సాధారణంగా అల్యూమినియం ప్లేట్ల పై ఒక ఫ్రిక్షన్ మెటీరియల్ అంటించడం ద్వారా తయారు చేస్తారు. అవి క్లచ్ ప్లేట్లతో ఫ్రిక్షన్ ఫోర్స్ ద్వారా ఇంజిన్ నుంచి ట్రాన్స్మిషన్‌కి పవర్‌ను అందిస్తుంది.
CFD (క్లచ్ ఫ్రిక్షన్ డిస్క్) కొంతకాలానికి అరిగిపోతుంది, అలా దాని సర్వీస్ పరిమితి మించిపోయినపుడు దాన్ని మార్చవలసి ఉంటుంది. CFD మార్చాలి అనడానికి మొదటి సూచిక, ప్రధానంగా కిక్ స్టార్టింగ్ కలిగి ఉన్న వాహనాలలో(100cc & 125cc కేటగిరీలో అన్ని మోడల్స్) కిక్ స్టార్ట్ చేసేటప్పుడు కిక్ స్లిప్ అవ్వడం.
ఒక అరిగిపోయిన CFD క్లచ్ స్లిప్పేజ్‌‌కి కారణమై ఇంజిన్ ఓవర్ హీటింగ్, పవర్ మరియు యాక్సలరేషన్ లేకపోవడం, ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల క్లచ్ ప్లేట్లు, ప్రెషర్ ప్లేట్లు మొదలైన పార్ట్లు కూడా డ్యామేజీ అవుతాయి.
HGP క్లచ్ ఫ్రిక్షన్ డిస్క్ ఉన్నతమైన నాన్ ఆస్బెస్టాస్ మెటీరియల్ నుండి తయారుచేశారు. ఇది తీవ్రమైన ఫ్రిక్షనల్ ఫోర్సులను తట్టుకోవడం మాత్రమే కాకుండా సమర్ధవంతంగా వేడిమిని కూడా నియంత్రిస్తుంది, అలాగే ఆస్బెస్టాస్ లేని కారణాన వాయు కాలుష్యం అవకుండా ఉంటుంది. ఇది ఆ విడి భాగం యొక్క జీవిత కలం మెరుగుపరిచి ఆరోగ్య సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది.
మరింత సహాయం కోసం, దయచేసి మీ సమీప ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.

సరిగ్గా ఐడిల్ అవ్వకపోవడం మరియు వాహనం నడిపేటప్పుడు యాక్సిలరేషన్ చేస్తే అదుపు తప్పడం వంటి సమస్యలు కొంత కాలంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి? నేను ఏ పార్టును మార్చాలి?

థ్రోటిల్ కేబుల్ మరియు లింకేజీ ఎక్కువకాలం వాడటం వలన అరిగిపోయి తరువాత డ్యామేజీ అవుతాయి. వాతావరణానికి బహిర్గితం అవడం వలన తుప్పు పట్టి క్షీణిస్తుంది. థ్రోటిల్ ఆపరేషన్ స్టికీగా మారిఇంజిన్ అధిక వేగంలో నడుస్తున్నప్పుడు థ్రోటిల్ వదిలనప్పటికీ థ్రోటిల్ వాల్వు స్మూత్‌‌గా వెనక్కి రాదు.
సరిగ్గా లేని ఐడిలింగ్ వలన ఇంధనం అధికంగా ఖర్చు అవుతుంది మరియు ఇంజిన్ ఓవర్ హీటింగ్ అవడానికి కారణమవుతాయి. కొన్ని విపరీత పరిస్థితులలో క్లచ్ విడుదల చేసినప్పుడు వాహనం పై పట్టు కోల్పోవచ్చు లేదా వాహనం పడిపోయి వాహనదారునికి ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి.
HGP థ్రోటిల్ కేబుల్స్ మోడల్ కన్ఫిగరేషన్ ఆధారంగా ప్రత్యేకంగా హీరో 2 వీలర్కు డిజైన్ చేయబడ్డాయి. ఈ కేబుల్స్ స్మూత్ ఆపరేషన్ మరియు పొడిగించిన సర్వీస్ కొరకు ఇంటర్నల్గా లూబ్రికేట్ చేయబడ్డాయి.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.
 

గేర్ షిఫ్ట్ ఆపరేషన్ కఠినంగా మారడం వల్ల నా మోటార్‌సైకిల్‌ను నడపడం కష్టంగా మారింది. ఈ సమస్యకు కారణం ఏమిటి?

క్లచ్‌ని ఆపరేట్ చేయడానికి క్లచ్ అసెంబ్లీ కేబుల్‌ని ఉపయోగిస్తుంది, దానివల్ల అవి సాగిపోతాయి మరియు దీర్ఘకాలం ఉపయోగించిన మీదట లింకేజ్ అరిగిపోవడం లేదా పాడవడం జరుగుతుంది. క్లచ్ కేబుల్స్ సాగినప్పుడు క్లచ్ యొక్క ఫ్రీ-ప్లే పెరుగుతుంది.
దీని వలన క్లచ్ పూర్తిగా విడుదల అవదు, తద్వారా గేర్ మార్చడం కష్టమవుతుంది అలాగే వాహనము నిలిపి ఉండి గేర్‌లో ఉన్నప్పుడు క్లచ్ డ్రాగ్ కూడా సంభవిస్తుంది. కొన్ని విపరీత పరిస్థితులలో, కేబుల్ లింకేజ్ నుండి తెగిపోతే వాహనం నియంత్రణ కోల్పోయి, వాహనానికి మరియు దానిని నడిపేవాళ్ళకి కూడా ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల నిర్ణీత సమయానికి పరిశీలన లేదా రీప్లేస్‌మెంట్ అనేది చాలా ముఖ్యం.
జెన్యూన్ కేబుల్ ఉపయోగించకపోతే, అవి అనుచితమైన ఫ్రీ-ప్లే కి దారి తీసు గేర్లను మార్చడం కష్టతరం చేస్తుంది. అందువలన, HGP క్లచ్ కేబుల్స్‌ని ప్రతి మోడల్ యోక్క నిర్దిష్ట అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డాయి. ఇంకా, HGP కేబుల్స్ అంతర్గతంగా లూబ్రికేట్ చేయబడి ఉంటాయి, దీని వలన స్మూత్ ఆపరేషన్ మరియు దీర్ఘ కాల సర్వీస్ లైఫ్ ఉంటుంది.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

పాడైన ఇంధన స్ట్రెయినర్ స్క్రీన్‌ను HGP ఇంధన స్ట్రెయినర్ స్క్రీన్‌తో మాత్రమే రీప్లేస్ చేయమని నేను ఎందుకు అడగాలి?

ఇంధనంలో మలినాలు ఉంటే ఫ్యూయల్ స్ట్రెయినర్ స్క్రీన్ బ్లాక్ అయిపోవడం లేదా డ్యామేజీ అవడం జరుగుతుంది. ఒక వేళ ఫ్యూయల్ స్ట్రెయినర్ స్క్రీన్ బ్లాక్ అయి ఉంటే కార్బురేటర్లో ఫ్యూయల్ లెవెల్ సరిపడా ఉండదు (ముఖ్యంగా అధిక వేగంలో వెళుతున్నప్పుడు) మరియు ఒక వేళ స్ట్రెయినర్ డ్యామేజీ అయిన సందర్భంలో మలినాలు ఫిల్టర్ లేదా స్క్రీన్ చేయబడవు, దీని వలన కార్బురేటర్లోని జెట్స్ బ్లాక్ అవడానికి ఆస్కారం ఉంది. ఈ రెండు సందర్భాల్లో, ఎయిర్ ఫ్యూయల్ రేషియోలో ఉన్న తేడా కారణంగా మధ్యస్తం నుండి హై స్పీడ్ ఆపరేషన్లో పవర్ తగ్గిపోతుంది మరియు స్టార్టింగ్ ప్రాబ్లెమ్ ఏర్పడుతుంది.
HGP యొక్క ఫ్యూయల్ స్ట్రెయినర్ స్క్రీన్ కార్బురేటర్ అటు నుండి ఇంజిన్‌‌కి వెళ్ళే ఇంధనాన్ని అత్యుత్తమంగా ఫిల్టర్ చేస్తుంది. మరింత సహాయం కోసం దయచేసి సమీపంలోని ఆథరైజ్డ్ వర్క్‌‌షాప్‌‌కి వెళ్ళండి.
 

నేను బ్రేక్ ఫ్లూయిడ్ మార్చకపోతే ఏమి జరుగుతుంది?

కొంతకాలానికి బ్రేక్ హోస్ ద్వారా బ్రేక్ ఫ్లూయిడ్ తేమను శోషించుకుంటుంది. తద్వారా దాని బాయిలింగ్ పాయింట్ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ శోషించుకున్న తేమ “వేపర్ లాక్” అయ్యే పరిస్థితిని మరింతగా పెరిగేలా చేస్తుంది. ఈ వేపర్ లాక్ పరిస్థితి వల్ల బ్రేకింగ్ సిస్టంలో పుట్టిన వేడి కారణంగా బ్రేక్ ఫ్లూయిడ్లో ఉన్న తేమ బాయిల్ అయ్యి బుడగలను సృష్టిస్తుంది, తద్వారా బ్రేకు సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా దీని వలన బ్రేకింగ్ సిస్టం ఇంటర్నల్ భాగాల్లో తుప్పు పడుతుంది, ఇది ఫంక్షనల్ ఇంపెయిర్మెంట్‌‌కు కారణమవుతుంది. బ్రేకులు వేయడం ద్వారా పుట్టిన వేడి కారణంగా కూడా బ్రేకింగ్ ఆయిల్ నాణ్యత క్షీణిస్తుంది.
సాధారణంగా, దీనిని 30000 కిమీ లేదా 2 సంవత్సరాలకి ఒకసారి మార్చుకోవాలి. సీల్ చేసిన డబ్బా నుండి సిఫార్సు చేయబడిన బ్రేకు ఆయిల్ (DoT 3 / DoT 4) ఉపయోగిస్తే సరైన భద్రతా ప్రమాణాలు పాటించినట్లు అవుతుంది. అలాగే బ్రేకు ఫ్లూయిడ్ లెవెల్ తగ్గినప్పుడల్లా టాప్ అప్ చేయమని సిఫార్సు చేయడమైనది. DOT 3 & DOT 4 బ్రేక్ ఫ్లూయిడ్లను కలపకూడదు.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

కొన్ని రోజుల నుండి హ్యాండిల్ బార్ రఫ్‌‌గా తయారయ్యి ఒక రకమైన శబ్దం కూడా వస్తుంది. దయచేసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు తెలియజేయండి?

రోడ్, బ్రేకింగ్ మరియు ఫ్రంట్ వీల్ పైన పడే లోడ్ కారణముగా ఉత్పన్నమయ్యే షాక్స్ వలన స్టీరింగ్ (హ్యాండిల్ బార్) యొక్క బేరింగ్స్ ఊగిసలాటకు గురి కావచ్చు లేదా వదులుగా అవ్వచ్చు. తీవ్రమైన సందర్భాలలో మౌంటింగ్ సెక్షన్స్/ బేరింగ్ రేసులు పాడైపోవచ్చు మరియు లూబ్రికెంట్ తగిన మొత్తంలో లేని కారణముగా వాహనాన్ని తిప్పడం కష్టంగా మారవచ్చు మరియు స్టీరింగ్ నుండి శబ్దం రావచ్చు.
HGP అందించే బాల్ రేస్ కిట్ మరియు లూబ్రికెంట్ వాడితే సుదీర్ఘ కాలం పాటు ఇబ్బందులు లేని పర్ఫార్మన్స్ హామీ లభిస్తుంది. మెరుగైన లూబ్రికేషన్ మరియు స్టీరింగ్ భాగాల యొక్క మెరుగైన జీవితకాలం కోసం ఈ ఐటెంలు ప్రత్యేకంగా సిఫారసు చేయబడుతున్నాయి.
ప్రతి 3000 కిమీలకి ఒక సారి స్టీరింగ్‌‌ని తనిఖీ చేసి అవసరమైతే సర్దుబాటు చేయవలసిందిగా మరియు ప్రతి 12,000 కిమీలకి ఒకసారి లూబ్రికేట్ చేయమని సిఫార్సు చేయబడుతుంది.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

షాక్ అబ్సార్బర్లు పాడైనప్పుడు ఏమి జరుగుతుంది?

రోడ్ ఉపరితలాల నుండి షాక్ అబ్సార్బర్స్ షాక్స్‌‌ను గ్రహిస్తాయి. ఇది రైడింగ్ సౌకర్యం మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. షాక్ అబ్సార్బర్స్ పాడైనప్పుడు,మీరు తక్కువ స్టీరింగ్ కంట్రోల్‌‌తో బంపియర్ రైడింగ్‌‌ను గమనించవచ్చు. దీని వలన టైర్లు కూడా త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది.
HGP సిఫార్సు చేసిన సస్పెన్షన్ భాగాలను ఉపయోగిస్తే దీర్ఘకాలిక మన్నికతో పాటు మృదువైన, స్థిరమైన మరియు సురక్షితమైన రైడ్ లభిస్తుంది.
షాక్ అబ్సార్బర్ ఆయిల్ (ఫ్రంట్)ను ప్రతి 30,000 కిమీలకి ఒకసారి రీప్లేస్ చేయమని సిఫార్సు చేయబడుతుంది.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

నేను HGP బల్బులను మాత్రమే ఇవ్వమని ఎందుకు అడగాలి?

జెన్యూన్ కాని బల్బ్ త్వరగా పాడైపోతుంది, సమయం గడిచే కొద్దీ కాంతి డిమ్ అవ్వడం ద్వారా ఇది తెలుస్తుంది. ఇది సాధారణం కంటే ఎక్కువ పవర్‌‌ను వినియోగించి బ్యాటరీ త్వరగా డ్రైన్ అయ్యేలా చేస్తుంది. సరైన వాటేజ్‌‌తో బల్బ్‌‌ను రీప్లేస్ చేయమని సిఫార్సు చేయబడుతుంది.
HGP వారి బల్బులు ప్రకాశవంతమైన కాంతిని, లాంగర్ లైఫ్ మరియు సమర్థవంతమైన పవర్ వినియోగం యొక్క హామీని అందిస్తాయి, దీని వలన బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ అవుతుంది మరియు దాని పనితీరు మెరుగుపడుతుంది.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

తగ్గిన మోతాదు మేరకు నేను ఇంజిన్ ఆయిల్‌‌ను నింపితే సరిపోతుందా లేదా కొత్త ఇంజిన్ ఆయిల్ నింపాలా?

తగ్గిన ఇంజిన్ ఆయిల్‌‌ను అంత మోతాదు వరకు రీఫిల్ చేస్తే, కొత్త ఆయిల్ ఇంజిన్‌‌లో ఉన్న పాత ఆయిల్‌‌తో కలిసిపోతుంది. ఇంజిన్ యొక్క పెర్ఫార్మన్స్ తాత్కాలికంగా మెరుగు పడినప్పటికీ స్లడ్జ్ మరియు మసి ఇంజిన్ పెర్ఫార్మన్స్‌‌ను ప్రభావితం చేస్తాయి. సిఫారసు చేయబడిన షెడ్యూల్ ప్రకారం ఇంజిన్ ఆయిల్‌‌ను పూర్తిగా మార్చడం మరియు టాప్ అప్ చేయడం ఉత్తమం. ఇంకా, ఇంజిన్ ఆయిల్ కోల్పోవడానికి గల కారణాలను పరిశీలించిన మీదట, అది పునరావృతం అవకుండా సరైన చర్యలు చేపట్టాలి.
మరింత సహాయం కోసం, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ వర్క్‌షాప్‌ను సందర్శించండి.

నా వద్ద ఒక "గుడ్‌లైఫ్ కార్డ్" ఉంది". HGP పై నేను పొందే ప్రయోజనాలు ఏమిటి?

గుడ్‌లైఫ్ ఇన్‌‌స్టా కార్డ్ యొక్క కొత్త విలువ ప్రతిపాదన కింద గుడ్‌లైఫ్ సభ్యులందరూ ఈ క్రింద ఇవ్వబడిన స్లాబ్‌ల ప్రకారం డిస్కౌంట్‌ను పొందవచ్చు:
గోల్డ్ మెంబర్స్ (0-5000 పాయింట్లు) - 2% డిస్కౌంట్
ప్లాటినం మెంబెర్స్ (5001- 50000 పాయింట్లు) - 3% డిస్కౌంట్
డైమండ్ మెంబెర్స్ (>50000 పాయింట్లు) - 5% డిస్కౌంట్
నమోదు చేసుకునే సమయంలో ఇన్‌‌స్టా కార్డు పొందిన కస్టమర్‌‌కి మాత్రమే కొత్త పార్టుల డిస్కౌంట్ విధానం వర్తిస్తుంది. పాత కస్టమర్లు HGP పై 5% డిస్కౌంట్ పొందుతారు.
మీకు దగ్గరలోని టచ్ పాయింట్‌‌ను లొకేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నేను HGP ని ఎక్కడ కొనుగోలు చేయగలను?

నిరంతరం పెరుగుతున్న కస్టమర్ ఆకాంక్షలను నెరవేర్చడానికి, మేము దానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి కస్టమర్ టచ్ పాయింట్ల యొక్క పూర్తి నెట్‌‌వర్క్‌‌ను అభివృద్ధి చేస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలలో 6000+ టచ్ పాయింట్స్ మరియు దేశ వ్యాప్తంగా 75 పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్, 800 ఆథరైజ్డ్ డీలర్స్ మరియు 1150 ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ల యొక్క విస్తృతమైన నెట్‌‌వర్క్ ద్వారా HGP తన ఉనికిని చాటుకుంటుంది. మీకు సమీపంలో ఉన్న టచ్ పాయింట్లను లొకేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
  • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
  • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018