హోమ్ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌లైఫ్ నమోదు చేసుకోవడం ఎలా?
మెనూ

నమోదు చేసుకోవడం ఎలా?

హీరో గుడ్ లైఫ్ ప్రోగ్రామ్, ప్రత్యేకంగా మీ కోసం ఎంపిక చేసిన రివార్డులు, ప్రయోజనాలు మరియు అద్భుతమైన బహుమతులను అందిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి, మీరు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి భారత దేశ నివాసి అయి ఉండాలి మరియు మీరు హీరో మోటోకార్ప్ టూ-వీలర్ యజమాని అయి ఉండాలి.

 

ఆఫ్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలి?

క్రింద పేర్కొన్న దశలను అనుసరించి భారతదేశంలో అతిపెద్ద రివార్డ్స్ కార్యక్రమంలో సభ్యులుగా చేరండి.

 1. మీ సమీప హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి
 2. గుడ్‌లైఫ్ అధికారిని సంప్రదించండి
 3. ఆన్‌‌లైన్ అప్లికేషన్ నింపి మెంబర్‌‌షిప్ ఫీజు చెల్లించండి.
  1. 1 సంవత్సరాలకి ₹ 175/- ఇన్స్యూరెన్స్ ప్రయోజనం మరియు 3 సంవత్సరాల ప్రోగ్రామ్ మెంబర్‌‌షిప్.
  2. 3 సంవత్సరాలకి ₹ 275/- ఇన్స్యూరెన్స్ ప్రయోజనం మరియు 3 సంవత్సరాల ప్రోగ్రామ్ మెంబర్‌‌షిప్.
 4. మీ మెంబర్‌‌షిప్ కాలపరిమితి వరకు యాక్సిడెంటల్ డెత్ ఇన్స్యూరెన్స్ కవర్‌కి అర్హత పొందుతారు.

 

ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలి

 1. ఆసక్తి గల హీరో టు వీలర్ యజమానులు/కస్టమర్లు ఇప్పుడు హీరో మోటోకార్ప్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో హీరో గుడ్‌లైఫ్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవచ్చు. మొదలు పెట్టడానికి, హీరో మోటోకార్ప్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం లేదా లాగిన్ అవ్వాలి.
 2. రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, మీరు గుడ్‌లైఫ్ విభాగం క్రింద కార్యక్రమం గురించి వివరాలు, దాని ప్రయోజనాలు మరియు హీరో గుడ్‌లైఫ్ ప్రోగ్రామ్‌‌లో "నమోదు" అయ్యే ఎంపికను కూడా కనుగొనవచ్చు.
 3. దయచేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్న హీరో గుడ్‌‌లైఫ్ సభ్యత్వాన్ని ఎంచుకోండి. మీరు ఈ క్రింది రెండు ఎంపికలలో ఒక దానిని ఎంచుకోవచ్చు:
  1. 1 సంవత్సరాలకి ₹ 175/- ఇన్స్యూరెన్స్ ప్రయోజనం మరియు 3 సంవత్సరాల ప్రోగ్రామ్ మెంబర్‌‌షిప్.
  2. 3 సంవత్సరాలకి ₹ 275/- ఇన్స్యూరెన్స్ ప్రయోజనం మరియు 3 సంవత్సరాల ప్రోగ్రామ్ మెంబర్‌‌షిప్.
 4. మెంబర్‌‌షిప్ ఎంచుకున్న తరువాత, అదే స్క్రీన్ పై మెంబర్‌‌షిప్ ఫీజు కనిపిస్తుంది
 5. మీ నామినీ వివరాలతో పాటు మీరు ఒక ప్రాథమిక ప్రొఫైల్ ఫారం (KYC) పూరించాలి.
 6. దయచేసి మీ ఫోటోను అప్‌‌లోడ్ చేయండి (గరిష్ఠ సైజు 50 kb). ఇది మా నుండి రికమెండ్ చేయబడుతుంది (ఇది కేవలం ఐచ్ఛికం మాత్రమే, మీకు చేయాలి అనిపించకపోతే వదిలేయండి పర్వాలేదు!)
 7. ఒకసారి ప్రొఫైల్ పూర్తి చేసిన తరువాత, ₹175 లేదా ₹ 275 మెంబర్‌షిప్ ఫీజ్ చెల్లించడానికి ఒక పేమెంట్ గేట్‌వే కి మళ్లించబడతారు.
 8. చెల్లింపు విజయవంతమైన తర్వాత, చెల్లింపు రసీదు, ఇన్వాయిస్ కాపీతో పాటు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ మరియు గుడ్‌లైఫ్ మెంబర్‌షిప్ వివరాలు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి పంపబడతాయి
 9. చెల్లింపు చేసిన 15 రోజులలోపు మీరు అందజేసిన పోస్టల్ చిరునామాకి గుడ్‌లైఫ్ మెంబర్‌షిప్ కార్డ్ మరియు కిట్ కొరియర్ చేయబడతాయి.
 10. ఒకవేళ యూజర్ ఆన్‌లైన్ ప్రొఫైల్ ఫారం పూరించేటప్పుడు డిజిటల్ కార్డు ఎంచుకుంటే, మెంబర్ యొక్క రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి ఇ-కార్డు పంపబడుతుంది.
మరిన్ని వివరాల కోసం దీనికి కాల్ చేయండి 18002660018 లేదా మాకు వ్రాయండి goodlife@heromotocorp.biz

విజయవంతంగా నమోదు అయిన తర్వాత, మీకు ఇన్‌స్టా హీరో గుడ్‌లైఫ్ మెంబర్‌షిప్ కార్డ్ అందుతుంది, ఇది అన్ని ఆథరైజ్డ్ హీరో మోటోకార్ప్ అవుట్‌లెట్లలో మీరే చేసే ఖర్చులపై పాయింట్లు సంపాదించడానికి మీకు సహాయపడుతుంది. మీరు పాయింట్లను సంపాదించవచ్చు మరియు అద్భుతమైన మైల్‌స్టోన్ రివార్డులు లేదా హీరో సర్వీస్ / సేల్స్ అవార్డు వోచర్ల కోసం వాటిని రీడీమ్ చేసుకోవచ్చు.

ఇప్పుడే నమోదు చేసుకోండి
 • మోసపూరిత విధానాల పట్ల జాగ్రత్తగా ఉండండి
 • మోసాలు మరియు స్కాముల బారిన పడకండి
 • మరింత చదవండి

హీరో లేదా దాని డీలర్స్ మీ OTP, CVV, కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ వాలెట్ వివరాలను షేర్ చేయమని ఎప్పుడూ అడగరు. దీన్ని ఎవరితోనైనా పంచుకోవడం వలన మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు.

టోల్ ఫ్రీ నంబర్. : 1800 266 0018