హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్
సరి కొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 ఫ్యూయల్ ఇంజెక్షన్ కలిగిన ఎక్స్సెన్స్ టెక్నాలజీతో లభిస్తుంది - రైడింగ్ పరిస్థితుల ఆధారంగా వాహన పనితీరును ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే స్మార్ట్ సెన్సార్ టెక్నాలజీ. ఇది మీకు మెరుగైన పికప్, మెరుగైన మైలేజ్, మెరుగైన మన్నిక మరియు భద్రత, మృదువైన రైడ్, మెరుగుపరిచిన రైడర్ భద్రత, మెరుగైన అప్హిల్ క్లైమ్బ్, మెరుగైన ఇంజన్ జీవితం, అన్ని వాతావరణ పరిస్థితులలో సులభమైన స్టార్ట్ మరియు టార్క్ ఆన్ డిమాండ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఆకర్షణీయంగా కనపడే విధంగా ఈ స్కూటర్ రూపకల్పన చేయబడింది. ఇది ఒక ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్, ఒక మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ మరియు అండర్ సీట్ బూట్ లైట్ మరియు ఒక కాంబినేషన్ లాక్‌తో లభిస్తుంది. అదనంగా, ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ (IBS), LED టైల్ ల్యాంప్, సైడ్-స్టాండ్ ఇండికేటర్ తో వస్తుంది, ఒక డిజి ఎనలాగ్ కోంబో మీటర్ కూడా ఉన్నాయి. 110CC ఇంజిన్ 6 kW @ 7250 RPM గరిష్ఠ పవర్ మరియు గరిష్ఠ టార్క్ 8.7 Nm @ 5750 RPM తో మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన ఎడ్జీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.